» » ‘నేనోరకం’ టీజర్ విడుదల


సాయిరాం శంకర్‌, రేష్మీమీనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘నేనోరకం’ సుదర్శన్ సలేంద్ర దర్శకుడు. విభా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దేపా శ్రీకాంత్ నిర్మిస్తున్నారు. శరత్‌కుమార్‌ కీలక పాత్రధారి. శనివారం ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో ఈ చిత్రం టీజర్‌ను వంశీ పైడిపల్లి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘ట్రైలర్‌ పూరిజగన్ స్టైల్లో ఆసక్తికరంగా ఉంది. మహిత్ అందించిన నేపథ్య సంగీతం బావుంది’’ అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘సమాజంలో చూస్తున్న ఓ సమస్య ఇతివృత్తంలో ఈ సినిమా రూపొందుతుంది. తండ్రీ కూతుళ్ల మధ్యనున్న అనుబంధం ఇందులో ప్రధానాంశం. శరత్‌కుమార్‌ నెగిటివ్‌ రోల్‌ చేశారు’’ అని అన్నారు. ‘‘లవ్‌, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పాటల్ని మే మొదటివారంలో విడుదల చేసి, చివరి వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని నిర్మాత చెప్పారు. సాయిరాం శంకర్‌, మహిత్ నారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

About newsreviews9

Hi there! I am Hung Duy and I am a true enthusiast in the areas of SEO and web design. In my personal life I spend time on photography, mountain climbing, snorkeling and dirt bike riding.
«
Next
Newer Post
»
Previous
Older Post

No comments:

Leave a Reply