» » ‘రాయుడు’గా విశాల్‌

 
విశాల్‌ హీరోగా ముత్తయ్య దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘రాయుడు’. విశాల్‌ సమర్పిస్తున్న ఈ చిత్రానికి శ్రీదివ్య కథానాయిక. ప్రముఖ పంపణీదారుడు జి. హరి ఈ సినిమాను హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. శనివారం ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్.  
 
ఈ సందర్భంగా హీరో విశాల్‌ మాట్లాడుతూ ‘నా కెరీర్‌లో ఇది ఓ డిఫరెంట్‌ మూవీ అవుతుంది. పవర్‌ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకొంటున్న ‘రాయుడు’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకొంటుందనే నమ్మకం ఉంది’ అన్నారు.
 
హరి మాట్లాడుతూ ‘మే మొదటివారంలో ఈ చిత్రం షూటింగ్‌ పార్ట్‌ పూర్తవుతుంది. అప్పుడే ఆడియోను గ్రాండ్‌గా విడుదల చేయాలనుకుంటున్నాం. మే 20న ‘రాయుడు’ సినిమాను రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని తెలిపారు.
రాధారవి, సూరి, ఆర్‌.కె.సురేశ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: వేల్‌రాజ్‌, సంగీతం: డి.ఇమాన్, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌., ఫైట్స్‌: అనల్‌ అరసు, నృత్యాలు: బాబా భాస్కర్‌, సమర్పణ: విశాల్‌, దర్శకత్వం: ముత్తయ్య.

About newsreviews9

Hi there! I am Hung Duy and I am a true enthusiast in the areas of SEO and web design. In my personal life I spend time on photography, mountain climbing, snorkeling and dirt bike riding.
«
Next
Newer Post
»
Previous
This is the last post.

No comments:

Leave a Reply